ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
క్యాబినెట్ ఆమోదం మరియు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.