News5am, Latest Breaking News (24-05-2025): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అందాల పోటీలపై ఎంతో శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం, హైదరాబాద్ నగర అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేస్తూ ఈవెంట్లు నిర్వహించే బదులు, బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీనగర్, కవాడిగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో రూ. కోటి 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా మండిపడ్డారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికులపై పాక్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ పునరావృతం చేస్తూ, దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. సైనికులను రాజకీయాల్లోకి లాగొద్దని, వారి ఆత్మస్థైర్యాన్ని దిగజార్చేలా మాట్లాడకూడదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి 70 శాతం రెవెన్యూ ఇచ్చే స్థాయిలో ఉన్నా, అక్కడి బస్తీలు, కాలనీలకు మౌలిక వసతుల కల్పన కోసం జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డ్ వంటి సంస్థలకు నిధులు కేటాయించకపోవడం విచారకరమని అన్నారు. నగరంలో కాంగ్రెస్‌కు బలం లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
More Latest Political News:
Political Breaking News:
నా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది..
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
More Today Political News: External Sources
సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు: కిషన్ రెడ్డి