CM Revanth Team

News5am, Latest News Breaking (26-05-2025): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. అదే విధంగా, ఇవాళ ఆయన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో సమావేశమై విస్తరణకు సంబంధించిన తుది కార్యాచరణను ఖరారు చేసే అవకాశముంది. విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై పార్టీ లోపల చర్చలు నడుస్తున్నాయని సమాచారం.

ఇప్పటికే రెండు నెలల క్రితం కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ మరోసారి రాజకీయ వేడి పెంచింది. ఈ నేపథ్యంలో పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి పదవికి తమకే అవకాశం ఉంటుందని భావించిన కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి లాంటి నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

More Latest News Breaking:

Latest News Political:

కాంగ్రెస్​ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ..

More Latest Political News Breaking: External Sources

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు క్లారిటీ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *