News5am, Latest News Telugu (11-06-2025): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాలపై అధికారిక విచారణను ఎదుర్కోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్, ఈ రోజు జూన్ 11న కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనుంది. ఉదయం 11.30 గంటలలోపు కేసీఆర్ బీఆర్కే భవన్‌కు చేరుకోనున్నారు. ఆయన ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక వ్యవహారాల్లో భాగమైన ఇంజినీర్లు, ఉన్నతాధికారులపై కమిషన్ విచారణ చేపట్టింది. జూన్ 6వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్‌ను కమిషన్ విచారణకు పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ఏ విధంగా ప్రశ్నలు వేస్తుంది? కేసీఆర్ ఏ సమాధానాలు ఇస్తారు? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ లను కూడా ఇప్పటికే కమిషన్ విచారించిన విషయం గమనించాలి.
More Latest News:
Latest News Telugu:
నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్..
More News Telugu: External Sources
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్..