Latest News Telugu

News5am, Latest News Telugu (05-06-2025): ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా రైతు భరోసా అమలు తేదీ, కార్యాచరణ ప్రకటన, బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం పై ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ, సమస్యలు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో అడిషినల్ డైరెక్టర్ పోస్టు, ఇతర విభాగాల్లో 16 పోస్టులు, ఫ్యాప్సికి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

అదే విధంగా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ప్రకటనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, కాళేశ్వరం లో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, జీఎస్టీ సమస్యలు, భూదాన్ భూముల దందా, గొర్రెల పంపిణీ స్కీం వంటి వివాదాస్పద అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే పవర్ కమిషన్, కాళేశ్వరం రిపోర్టులు చేతికి అందడం, మిగిలిన ఎంక్వైరీలన్నీ తుదిదశకు చేరిన నేపథ్యంలో గురువారం జరుగబోయే కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

More Latest News Telugu Breaking:

Today News Telugu:

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడంపై నిరసన..

కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేశాయి..

More Telugu: External Sources

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *