News5am Latest news Now ( 01/05/2025) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి అమరావతి పర్యటనకు వాతావరణం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాభావం ఏర్పడే సూచనలు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సభ జరుగనున్న ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని, అనివార్య పరిస్థితులలో ఎలా స్పందించాలి అన్న దానిపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. వర్షం కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.