News5am, Latest Telugu Updates (20-05-2025): ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. వచ్చే నెల అమలు చేయనున్న “తల్లికి వందనం” మరియు “అన్నదాత సుఖీభవ” పథకాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదించిన కొన్ని ప్రాజెక్టులకు కేబినెట్ నుంచి కూడా ఆమోదం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై కూడా సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు.
కేబినెట్ సమావేశంలో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంది. వచ్చే నెల 12న కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలు, అమలైన పథకాలపై జిల్లాల వారీగా సమావేశాలు, సభలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై కార్యాచరణను కేబినెట్‌లో చర్చించనున్నారు. అదేరోజు (జూన్ 12) ఒక భారీ సభ నిర్వహించే ఆలోచన కూడా ఉంది. రాజధాని నిర్మాణం, ఐకానిక్ టవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి అంశాలపై కూడా చర్చ జరగనుంది. కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై, లిక్కర్ అరెస్టులపై, మంత్రుల పాత్రపై చర్చించే అవకాశముంది. మహానాడులో ప్రస్తావించదలచిన సంక్షేమ కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
More Latest Telugu Updates:
Latest Buzz:
అగ్నిప్రమాదంలో కనీసం 17 మంది మరణించారు..