బీజేపీ ఒంటరిగా 125 సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని నిరూపించుకుంది. యూపీలో ఏడు స్థానాల్లో ముందంజలో ఉందన్నారు. ఎన్డీయే కూటమి ఇన్ని అబద్ధాలు ప్రచారం చేసిందని మహారాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐక్యతను చాటిందని అన్నారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి. కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్ర కి కాంగ్రెస్ డబ్బులు పంపిందని తెలిపారు.
ఇచ్చింది ముఫ్ఫై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు, చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారన్నారు. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారన్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ట్యాపరింగ్ చేసారా అన్నారు. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ లో ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యిందన్నారు. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయన్నారు. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు,మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉందన్నారు. కులగణన వివరాలు పెన్సిల్ తో నింపుతున్నారు. వాటిని మార్చే అవకాశం ఉందన్నారు. కులగణన లో భయపెట్టి సర్వే చేస్తున్నారన్నారని తెలిపారు.