తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ అధికారిక కార్యక్రమానికి మాజీ సీఎం, బీఎస్‌ఆర్‌ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు పంపుతోంది. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖుల‌తో పాటు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించింది.

దీనికోసం ఆయ‌న వ‌ద్ద‌కు మంత్రి పొన్నంను పంపుతోంది. మ‌రికాసేపట్లో ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్ల‌నున్నారు. బీఎస్ఆర్ అధినేతను తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల్సిందిగా స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *