మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చండూరు మండలం శిర్డేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని లింగోజు కిరణ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు.శనివారం శైవక్షేత్రమైన చెరువుగట్టు నుంచి శ్రీశైలం వరకు అభిమాని పాదయాత్ర ప్రారంభించారు. మున్ననూర్ గేటు వద్ద చండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు కలిసి పండ్లు పంపిణీ చేశారు.