పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూడడమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో బయ్యన్న వాగు రిజర్వాయర్ నుంచి పాలేరు వాగుకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఎమ్మెల్యే కర్కాల చెక్‌డ్యామ్‌ను పరిశీలించి పూజలు చేశారు.
వెలికట్ట శివారులోని పెద్ద మంగ్య తండా కింద ఎస్సారెస్పీ కాలువ మధ్యలో పెద్ద రాయి ఉందని, దీంతో సాగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే సొంత ఖర్చుతో పెద్ద బండను తొలగించేందుకు ఏర్పాట్లు చేసి పనులు పూర్తి చేశారు. దీంతో రైతులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.