భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ ప్రతినిధిగా మరియు కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా పురంధేశ్వరిని నామినేట్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2026 చివరి వరకు నియామకం, అంటే 2024 నుంచి 2026 వరకు పురంధేశ్వరి కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. మహిళా పార్లమెంటేరియన్ల స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటనలో తెలిపారు.
కాగా, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ బీజేపీ నుంచి రాజమండ్రి లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు.. దీంతో.. మరోసారి ఆమెను కేంద్రమంత్రి పదవి వరిస్తుందా? అనే చర్చ కూడా సాగింది.. కానీ, ఇప్పుడు కీలక పోస్టుతో ఆమెను గౌరవించింది ఎన్డీఏ సర్కార్.. కాగా, ప్రస్తుతం ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతోన్న విషయం విదితమే.