MP Vamsi: తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ ఆరోపించారు. జూలై 14న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన, తెలంగాణ రైతులకు ఎరువులు అందించాలన్న లక్ష్యంతో ఈ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. అయితే కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన 60 శాతం యూరియా కోటాను 30 శాతానికి తగ్గించిందని, తెలంగాణలో తయారవుతున్న యూరియాను ఇక్కడి రైతులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించారు. ఇది పూర్తిగా అన్యాయమని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణను చిన్నచూపు చూస్తోందని అన్నారు. తెలంగాణ కేంద్రానికి ఇచ్చే ప్రతి రూపాయికి కేంద్రం కేవలం 30 పైసలే తిరిగి ఇస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణపై అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఎంపీ వంశీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణను తక్కువ చేస్తోందని, కేంద్రం కుట్రలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. యూరియా కొరత సమస్యను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అడగగానే కేంద్రం రూ.90,000 కోట్ల ప్రాజెక్ట్ ఆమోదించిందని, ఇది కమీషన్ల రాజకీయమేనని విమర్శించారు. అలాగే నీటి పంపిణీ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
Internal Links:
బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ..
ములుగులో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క ఆగ్రహం..
External Links:
బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు.. బనకచర్లపై కేంద్రంతో పోరాటమే: MP వంశీ