భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, మధ్య యూరోపియన్ దేశాలలో పోలాండ్ భారతదేశానికి ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. పోలాండ్‌కు చెందిన దాదాపు 30 కంపెనీలు భారత్‌లో వ్యాపారం చేస్తున్నాయి. అలాగే భారత్ నుంచి 5 వేల మంది విద్యార్థులు పోలాండ్ లో చదువుతున్నారు.
పోలాండ్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ కానున్నారు. ఏడాదిన్నర కాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అందరి దృష్టి నరేంద్ర మోదీ పర్యటనపైనే ఉంది. అయితే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పట్టుబట్టింది. ఇప్పుడు జెల్లెన్ స్కీతో భేటీలోనూ మోడీ అదే వైఖరికి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.