Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (జూలై 21) ప్రారంభమవుతున్నాయి. ఇవి ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజునుంచే ఈ సమావేశాలు తీవ్ర చర్చలకు వేదికవ్వనున్నాయి. ప్రధానంగా విపక్షాలు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గట్టిగా ప్రశ్నించేందుకు వ్యూహం రూపొందించాయి. ఇండియా కూటమిలోని 24 పార్టీల నేతలు సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చించారు. మొదటి రోజు కార్యక్రమాల్లో ఉదయం 10:15కు ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ ప్రకటన చేస్తారు. అనంతరం లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లుపై ప్రత్యేక కమిటీ నివేదికను సమర్పిస్తుంది. స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ జరుగుతుంది. అలాగే, జస్టిస్ వర్మపై మహాభియోగ ప్రక్రియపై చర్చకు అవకాశం ఉంది. గత మూడు నెలల్లో మరణించిన 7 మంది ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళులు అర్పించనున్నారు. విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు, బీహార్ SIR అంశాలపై విమర్శలు చేయాలని సిద్ధమవుతున్నాయి.
ఈ సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌ను ఆపడం, బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR), అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ట్రంప్ వ్యాఖ్యలు వంటి అంశాలపై విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. అయితే, ఈ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ముఖ్యంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేంద్రం సమగ్ర సమాధానం ఇస్తుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ, ట్రంప్ సీజ్‌ఫైర్ వ్యాఖ్యలపై, పహల్గాం దాడి లోపాలపై, బీహార్ SIRలో అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో స్వయంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Internal Links:
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు..
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు..
External Links:
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలతో పలు అంశాలపై చర్చలు..!