ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న కర్ణాటక పర్యటన సందర్భంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు చెట్లను కాపాడే పాత్ర పోషించేవారని, కానీ ఇప్పటి హీరోలు చెట్లను నరికివేసే స్మగ్లర్ల పాత్ర పోషిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ 1973లో నటించిన ‘గంధడ గుడి” చిత్రాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ సినిమాలో రాజ్ కుమార్ అడవుల్లోని చెట్లను నరకకుండా స్మగ్లర్లను, వేటగాళ్లను అడ్డుకుంటాడని పవన్ పేర్కొన్నారు.
అయితే అల్లు అర్జున్ ను ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడని ఓ వర్గం నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పుష్ప, పుష్ప-2 చిత్రాల్లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించగా, ఇటీవల ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల కారణంగానే పవన్‌ను ఈ విధంగా టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతిచ్చారనే వార్తను దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తోందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. నటనలో అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ ఎలాంటి పోటీ ఇవ్వలేదని కొందరు అంటున్నారు.