ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. మార్క్ శంకర్ కాళ్ళు మరియు చేతులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.
మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్క్ శంకర్ గాయపడటంపై పెదనాన్న చిరంజీవి, ఏపీ మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.