ప్రజలందరికీ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హృదయాన్ని పిండేసే దృశ్యాలను, గుండెను పిండేసే కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. బాధితుల ముఖాల్లో, ఓ వైపు అంతులేని వేదన, మరో వైపు “అన్న” వచ్చిండన్న భరోసా. వారిని ఆదుకునేందుకు.. కన్నీళ్లు తుడవడానికి వీలైనంత సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉంటాం. ఈ ఆక్రమణల కారణంగా ఖమ్మంలో కూడా వరదలు వచ్చాయి అని వెల్లడించారు. పూర్వం గొలుసుకట్టు చెరువులు ఉండేవి. మూడో రిటైరింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామన్నారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారని అన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశాం అన్నారు. మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయన్నారు. 42 సెంటీమీటర్ల వర్షం అంతే ఇది అత్యధికంగా పడింది. 75 సంవత్సరాలలో ఇంత వర్షం పడలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థను కూడా సిద్ధం చేస్తానన్నారు. గతంలో బాధితులకు రూ.10 వేలు తక్షణం అందించమని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, నగరాన్ని పరిశీలించారు. వరదలో మృతి చెందిన శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు.