దీపావళి పండుగ సందర్భంగా మట్టి దీపాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించే సమయంలో మట్టి ప్రమిదలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. మట్టితో చేసిన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. మట్టి టీ కప్పులు, మట్టి నీళ్ల బాటిళ్లను వినియోగించి ఆర్థిక ఉపాధి అవకాశాల కోసం కుమ్మరులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.