ముస్లింలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ మరియు ప్రేరణను పెంపొందిస్తుందని వారు ఆశించారు. అన్ని ప్రయత్నాలలో మీకు ఆనందం మరియు విజయం చేకూరాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈరొజు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపుకు గుర్తుగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీనితో, సోమవారం ఈద్ జరుపుకుంటున్నారు.