Pulivendula ZPTC Election Result

Pulivendula ZPTC Election Result: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఉప ఎన్నికతోనే పులివెందుల కోటను కూల్చి, దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేశామని అన్నారు. పులివెందులలో పసుపు జెండా ఎగిరిందని పేర్కొన్నారు. సొంత ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోవడం, ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో చూపిస్తుందని అన్నారు. ఇది వైసీపీ ఓటమి కాదని, జగన్ అహంకారానికి చెంపదెబ్బగా, అవినీతి, అణచివేత, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు.

మూడున్నర దశాబ్దాల తర్వాత భయంలేకుండా ఓటు వేసిన పులివెందుల ప్రజలదే ఈ విజయం అని మంత్రి అన్నారు. టీడీపీ సాధించిన ఈ విజయం ఏడాది పాలనకు ప్రజలు ఇచ్చిన రెఫరెండమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న జగన్, బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఈ ఎన్నిక ఫలితానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పులివెందుల ప్రజలు తమ ఆకాంక్షలను స్పష్టంగా తెలియజేశారని, జగన్ అరాచక పాలనకు గుడ్‌బై చెప్పారని వ్యాఖ్యానించారు.

Internal Links:

బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేదెలా..

External Links:

పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది.. ఇది జగన్ అహంకారానికి చెంపదెబ్బ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *