కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్, అక్కడి నుంచి హనుమకొండకు హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు అక్కడ కాంగ్రెస్ శ్రేణులతో రాహుల్ సమావేశమవుతారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హనుమకొండలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమకొండను సందర్శించిన అనంతరం ఇవాళ రాత్రి తమిళనాడుకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆయన రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.