ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఏది అయిన అంశం ప్రధానంగా నిల్చింది అంటే అది “రెడ్ బుక్ హే”. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలకు రెడ్ బుక్ చూయిస్తూ గట్టిగ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన నాయకుల పేర్లు రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నా అని, మేము అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తానని తేల్చి చెప్పారు. ఏపీలో వైసీపీ కార్యకర్తల పైనా జరుగుతున్న దాడులపై మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. తర్వాత లోకేష్ రెడ్ బుక్ పై విమర్శలు చేసారు. రెడ్ బుక్ పేరుతో తమ కార్య కర్తలని , వైసీపీ నాయకులని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
మాజీ సీఎం జగన్ కొద్ది రోజులుగా రెడ్‌బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు, తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తప్పు చేసిన వారందరిని తప్పకుండ శికిస్తామని , వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంకా రెడ్ బుక్ తెరవాలేదని , తెరిస్తే ఎవర్ని వదలమన్నారు. ఇచ్చిన మాటకి కట్ట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడ్తున్నారు అని అన్నారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని మంత్రి నారా లోకేష్ నిలదీశారు. అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకొని వాస్తవాలు వివరిస్తామన్నారు. వైసీపీ కార్యకర్తల లాగా తమ కూటమి కార్యకర్తలు బూతులు తిట్టరు, జగన్ కుటుంబ సభ్యులను అగౌరవపరచరు అని హామీ ఇచ్చారు.