బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.