Revanth Reddy Review on Floods: రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలు, సహయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వదరలు, ప్రస్తుతం అందుతోన్న సహయక చర్యల గురించి అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. మెదక్, కామారెడ్డి జిల్లాలను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం (ఆగస్ట్ 27) ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానతో రెండు జిల్లాలు జలమయమయ్యాయి. పల్లెలు, పట్టణాలు, పంట పొలాలు నీట మునిగాయి. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
వరద నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వరుణిడి ఆగ్రహానికి గురైన మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సీఎం బయలుదేరనున్నారు.
Internal Links:
ఒబెరాయ్ హోటల్ కు అలిపిరిలో భూములు..
టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు..
External Links:
వరదలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు