అసెంబ్లీలో గత కొద్దీ రోజుల నుండి ఇరు పక్షలపై విమర్శలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది అని పేర్కొన్నారు. అందరినీ వెన్నుపోటు పొడించిందని విమర్శలు కురిపించారు . ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో స్పందిస్తూ కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే తాము బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చానన్నారు. తాము అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కెసిఆర్ హాజరు కాలేదన్నారు. మీ పాలనా అనుభవాలతో ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిందన్నారు. పదేళ్ల పాలనా పూర్తి చేసుకున్న వారు , 10 నెలలు పూర్తి చేసుకొని ప్రభత్వంపై విమర్శలు చేస్తుందన్నారు.
బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బతుకమ్మ చీరాల కాంట్రాక్టు బినామీలకు అప్పగించారన్నారు. సూరత్ నుంచి కిలోల కొద్దీ చీరలను తెచ్చి కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. కాంగ్రెస్ , ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు , ఒకటొక్కటి అమలు చేస్కుంటా వస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు, ప్రజల సమస్యలను తెలుసోకోవడానికి ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నాం అని పేర్కొన్నారు.