తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి, వారి బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకట్టుకునే లక్ష్యంగా అమెరికాలో పర్యటన కొనసాగనుంది. అమెరికాలోని డల్లాస్ మరియు ఇతర రాష్ట్రాల్లో సీఎం బృందం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం కొన్ని కంపెనీలతో సమావేశాలు జరపనున్నారు. రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల సీఈవోలను కలిసి వారిని తెలంగాణాలో పెట్టుబడులు పెట్టమని కోరారు. తిరిగి ఆగస్టు 11న సీఎం రేవంత్‌రెడ్డి బృందం హైదరాబాద్‌కు రానున్నారు.