ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ నేరారోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కవిత బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవితకు బెయిల్ మంజూరయింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ ధర్మాసనం విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలు కేసుల్లో ఆమె తనకు బెయిల్ ఇప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కల్వకుంట్ల కవిత తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలను వినిపించారు. కవిత విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. సౌత్ గ్రూపు సంస్థల నుంచి వంద కోట్లు వసూలు చేశారంటున్నారని, కానీ ఆ మొత్తాన్ని ఇంత వరకూ దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేదని ప్రస్తావించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సీబీఐ, ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు కవితకు కండీషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.