మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో బస చేయనున్నారు. కలెక్టరేట్‌లో, అధికారులతో సమీక్షకు గవర్నర్ హాజరుకానున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో సూర్యాపేట చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్‌కు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి 11.30 గంటలకు జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించనున్నారు.

అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు. అయితే సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం బయలుదేరి వెళతారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *