Sushila Karki Former Chief Justice: నేపాల్‌లో జనరేషన్ జెడ్ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఉద్యమం చేపట్టి, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోంది. సోషల్ మీడియా బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ 13 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న యువత ఈ నిరసనల్లో పాల్గొన్నారు. తాము చేపట్టిన ఉద్యమాన్ని కొందరు అవకాశవాదులు తప్పుదారి పట్టించారని జెన్ జెడ్ ఆరోపించింది. నిరసనల మధ్య ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయం, పార్లమెంట్, సుప్రీంకోర్టు భవనాలను నిరసనకారులు దగ్ధం చేశారు.
ఈ పరిస్థితుల్లో నేపాల్ ఆర్మీ దేశాన్ని నియంత్రణలోకి తీసుకుని నిరసనకారులతో చర్చలు జరిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆన్‌లైన్ మీటింగ్‌లో సుమారు నాలుగువేల మంది పాల్గొని ప్రతిపాదించారు. ఆ సమయంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా సూచించారు. ఆమె ఆర్మీతో పాటు ప్రభుత్వాధికారులతో చర్చల్లో పాల్గొని దేశాన్ని ముందుకు నడిపించాలని జెన్ జెడ్ భావిస్తోంది.
Internal Links:
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..
నేడు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన…
External Links:
తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా సుశీలా కర్కి పేరును ప్రతిపాదించిన జెన్-జెడ్