Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయి. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. ఈ రిపోర్టును క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. సభ్యులకు నివేదిక అందించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తర్వాత చర్చలు నిర్వహించి తుది నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం తదుపరి చర్యలను నిర్ణయించనుంది. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి సంతాపం ప్రకటిస్తారు. అనంతరం సభ వాయిదా వేస్తారు. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఇందులో అజెండా, సమావేశాల వ్యవధి నిర్ణయిస్తారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ, శనివారం నిమజ్జనం ఉండటంతో గురువారం వరకే సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.

అసెంబ్లీ వాయిదా అనంతరం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఇది కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఇందులో బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయాలు తీసుకుంటారు. బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మంత్రుల కమిటీ ఇప్పటికే మూడు ప్రతిపాదనలు చేసింది. అవి ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచడం. పార్టీ స్థాయిలో అమలు చేయడం. లేదా బిల్లులు, ఆర్డినెన్స్‌పై న్యాయపరమైన పోరాటం చేయడం.

Internal Links:

పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత..

వరదలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష..

External Links:

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *