Telangana Bc Reservation Bill

Telangana Bc Reservation Bill: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కుల గణనను చేపట్టి, శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ ఆధారంగా బీసీలకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ క్యాబినెట్ తీర్మానం చేసింది. అనంతరం అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి, ఉభయ సభల ఆమోదం తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ నాలుగు నెలలు గడిచినా రాష్ట్రపతి ఆమోదం రాలేదు, బిల్లులు తిరిగి పంపలేదూ. 2018లో అమలులో ఉన్న రిజర్వేషన్ల పరిమితిని తొలగించేందుకు ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందలేదు.

దాంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి మద్దతు కూడగట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా అనంతరం రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మోడీ సర్కార్ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం ముగిసిన తరువాత, రాష్ట్రంలోనే తదుపరి కార్యాచరణపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. రిజర్వేషన్ల అమలులో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని చెప్పుతూ, క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టే యోచనలో ఉంది ప్రభుత్వం.

Internal Links:

నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ మహాధర్నా…

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి కౌంటర్‌..

External Links:

దగ్గర పడుతున్న గడువు.. బీసీ రిజర్వేషన్‌పై నెక్స్ట్ ఏంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *