తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. 2024 బడ్జెట్ సమావేశాలు జూలై 23 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మండలి సమావేశాలు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 25న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్ర పూర్తి వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీపై వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ చిహ్నంలో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విపక్షాల సమక్షంలో ప్రభుత్వం ప్రకటించిన 6 హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, తాజాగా ఈసారి సభలకు హాజరవుతానని ప్రకటించడంతో రానున్న సమావేశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వలసలు ఎక్కువగా ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ అదే చట్టాన్ని మెచ్చుకుంటూ ఫిరాయింపు చట్టాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాలని బీఆర్ఎస్ వాదనలు ముందుకు తెచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఆరు హామీల అమలుపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సింహభాగం హామీలను అమలు చేసినప్పటికీ గృహలక్ష్మి కింద మహిళకు రూ. 2,500 అందించేటువంటి కొన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయి.