నేడు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటించనున్నారు. ఇవాళ భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కవులు, కళాకారులతో సమావేశం కానున్నారు.
భద్రాచలంలో పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న ఆయన అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.