ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించినన్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితిని అంచనా వేయనున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది.