News5am, Telangana Latest News(14-05-2025): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మే 14) ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన వివిధ అధికార సమీక్షలు, నియామక పత్రాల పంపిణీ వంటి కీలక అంశాలను ప్రాధాన్యతనిచ్చి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షనకు సంబంధించిన అంశాలు చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సమగ్రంగా ఈ అంశాన్ని సమీక్షించనున్నారు.
తర్వాత సాయంత్రం 6:30 గంటలకు జలసౌధలో జరిగే “కొలువుల పండుగ” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నీటిపారుదల శాఖలో ఇటీవల నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్‌లు (AE), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌లు (JTO)లకు ఆయన నియామక పత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన అభ్యర్థులను అభినందించనున్నారు. అనంతరం ప్రాధాన్యత కలిగిన నీటి ప్రాజెక్టులు మరియు అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో మరో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశముంది. రాష్ట్రానికి నీటి వనరుల్లో న్యాయమైన వాటా, వినియోగంలో సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో సీఎం మునుపటి ప్రణాళికలను పరిశీలించనున్నారు.
More Breaking Telugu News
Latest Bullion Market News: తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం..