ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులపై ఇరు పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని ఎంపీ రఘునందన్ రావు మండి పడ్డారు. కేంద్రం అన్ని రాష్టాలకు సమానంగా కేటాయింపులు జరిపాయన్నారు. తెలంగాణ రాష్టంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆలోచన విధానం ఒకటే అన్నారు. జెండాలు మాత్రమే మారాయని ఆలోచన విధానాలు ఎం మారలేదని విమర్శించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో ప్రతి దానికి లెక్కలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.