సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు (ఏప్రిల్ 14) గుంటూరులోని తాడికొండ నియోజకవర్గంలో ఉంటారు. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు.
ఇక, సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అంబేడ్కర్ విద్యా పథకం కింద రుణాలు తీసుకుని చదువుకున్న స్టూడెంట్స్ తో వర్చువల్ సమావేశంలో సీఎం మాట్లాడనున్నారు. దీంతో పాటు పీ- 4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి – బంగారు కుటుంబాలతో సుమారు రెండు గంటల పాటు ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అనంతరం తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగులో టీడీపీ కేడర్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.