News5am Today Telugu News(12/05/2025) : ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఒకటేనని, ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని ఆరోపించారు. ప్రతిపక్షంగా పని చేయడం తప్పుకాదు కానీ, విమర్శలు చేయాలంటే అవి అర్థవంతంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన మంత్రి, సీతారామ ప్రాజెక్టుకు కనీసం కరెంట్ కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. భూమిని కోల్పోయిన వారికి భూమినే బదులుగా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధోరణి అయినా, తాత్కాలికంగా నగదు రూపంలో సాయం అందిస్తున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
ఆర్థికంగా ప్రభుత్వం బలహీనంగానే ఉన్నప్పటికీ, దాదాపు రూ.680 కోట్ల వ్యయంతో 16–17 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇప్పటివరకు 9 కిలోమీటర్ల పనులు మొదలయ్యాయని, రెండు వైపులా డ్రెయిన్, బీటీ రోడ్లను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. గత ఆగస్టులో మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయని, తాను, సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క కలిసి అక్కడ ఐదు ఆరు రోజులు పర్యవేక్షించామన్నారు. ఈ ప్రభుత్వం జీవో ఇచ్చే పరిమితిలో మాత్రమే ఉండకుండా, పనులు ప్రారంభించడంలో నిబద్ధత చూపుతోందని చెప్పారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు స్థలాలు, ఇళ్లు కల్పిస్తామని, ఇరిగేషన్ భూములు ఉన్నవారు వాటిని ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యుల్లానే భావిస్తున్నామని, సమస్యలను ఒప్పుకోకుండా తప్పించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
Today Telugu News
చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్..
పాక్ కు కీలక సమాచారం చేరవేత..
More Today Telugu News : External Sources
https://ntvtelugu.com/news/ponguleti-comments-khammam-development-797818.html