తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాన్స్ జెండర్ల వాలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలన్నారు. సమీక్ష సందర్భంగా యూనిఫామ్ నమూనా చిత్రాలను విడుదల చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్‌లో కొత్త ప్రయోగం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్ల వాలంటీర్లను నియమించాలని అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు ఉన్నాయి. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతినెలా కొంత ఉపకార వేతనం ఇవ్వాలన్నారు. కొంత ఉపాధి లభించిందని చెప్పారు. అందుకు ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వీరికి వారం, పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వాలి. విధుల్లో ఉన్న ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక యూనిఫాం ఉండాలని అధికారులకు సూచించారు.