Vice Presidential Election: భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7న విడుదలకానుండగా, అదే రోజు నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ పార్లమెంట్‌లోని వసుధ భవన ఫస్ట్ ఫ్లోర్‌లో జరుగుతుంది. పోలింగ్ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 782 మంది ఓటరు ఎంపీలు పాల్గొననున్నారు. రాజ్యసభలో 233 మంది ఎన్నికైన సభ్యుల్లో 5 స్థానాలు ఖాళీగా ఉండగా, లోక్‌సభలో 543 మందిలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 12 మంది నామినేట్‌డ్ సభ్యులతో కలిపి మొత్తం 788 ఓటర్లలో 782 మంది ఓటు వేయనున్నారు. ఓటింగ్ పూర్తిగా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఓటర్లు ఈసీ అందించే ప్రత్యేక పెన్‌తోనే తమ ఎంపికను బ్యాలెట్ పేపర్‌పై గుర్తించాలి. మొదటి ప్రాధాన్యత గుర్తించకపోతే ఓటు చెల్లదు. పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేయలేవు. రాజ్యసభ కార్యదర్శి రిటర్నింగ్ ఆఫీసర్‌గా, మరో ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు.
Internal Links:
రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..
ప్రభుత్వ జాగాల్లో ప్రార్థనా మందిరాలు కట్టొద్దు..
External Links:
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఎన్నిక ఎప్పుడంటే..!