కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. వరి కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవణ్ణపల్లిలో కిషన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. నేడు ఈ నెల 11, 13 తేదీల్లో బీజేపీ బృందాలు వాటి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయనున్నాయి.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుబ్బికర్ సహేష్ ఏర్పాట్లను పరిశీలించారు. పోచంపల్లి, రేవణపల్లి, గౌస్కొండ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకుంటానని కిషన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల వద్దకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడతానని వివరించారు.