వరంగల్: తెలంగాణ రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ (టీఎస్‌సీఓజీఎఫ్) లిమిటెడ్ చైర్మన్‌గా వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తాను డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో రైతులకు అండగా నిలవడంతోపాటు బ్యాంకు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశానన్నారు. “అవకాశాన్ని వృధా చేయనివ్వను. ప్రభుత్వం, పార్టీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తాను' అని రాఘవరెడ్డి, తన నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు జంగా రాఘవరెడ్డిని అభినందించారు.