మంగళగిరి ప్రజల కోసం 'ప్రజాదర్బార్' నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి వాసుల మనసు దోచుకున్నారు లోకేష్. ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలతో లోకేష్ సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. 2019 నుంచి మంగళగిరి ప్రజల తరుపున లోకేశ్ ప్రజల్లో కనిపిస్తూనే ఉన్నారు. మంగళగిరి ప్రజలకు తన ఇంటి తలుపులు తెరుస్తానని ఎన్నికల ప్రచారంలో లోకేష్ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చడంలో భాగంగానే నియోజక వర్గాల సమస్యలను నేరుగా విన్నవించేందుకు 'ప్రజాదర్బార్' నిర్వహించారు. లోకేశ్ తన సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజలకు మరింత ఆదరణ పొందారు. లోకేష్ స్థానికేతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో తప్ప ఉండవల్లి నివాసంలో ప్రతిరోజూ ఉదయం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *