IPL 2024లో, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ శనివారం, మే 11న మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్‌పై దృష్టి సారిస్తారు. మరోవైపు, KKR ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ధృవీకరించింది. మరోవైపు, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. కాగా, కోల్‌కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 4 విజయాలు, 8 ఓటములతో 8వ స్థానంలో ఉంది. ఒకవైపు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కేకేఆర్‌కి కేవలం ఒక్క విజయం మాత్రమే కావాలి. అదే సమయంలో ముంబై ఇప్పటికే టాప్ 4 రేసులో లేదు. ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతా మధ్య ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 23 మ్యాచ్‌లు గెలుపొందగా, కేకేఆర్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై 7 గెలిచి, KKR 3 గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ముంబైపై కోల్‌కత్తాదే పైచేయి కనిపిస్తోంది.