2025 Women’s World Cup: నాగపూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ 2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు స్టార్ కోనేరు హంపీపై 2.5-1.5 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తొలి ర్యాపిడ్ గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో 75 ఎత్తుల అనంతరం దివ్య గెలుపొందారు. మహిళల ప్రపంచ చెస్ టైటిల్‌ను సాధించిన తొలి భారత మహిళగా దివ్య నిలిచారు. ఈ గెలుపుతో ఆమె గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడంతో పాటు, క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హతను సైతం సాధించారు.
ఈ మ్యాచ్‌కు ముందు శనివారం, ఆదివారం జరిగిన రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగిశాయి. హంపి గట్టి పోటీ ఇచ్చినా విజేత తేలక టైబ్రేకర్‌కు చేరింది. టైబ్రేకర్‌లో మొదటి ర్యాపిడ్ గేమ్‌ను దివ్య తెల్ల పావాలతో ఆడి డ్రా చేయగా, రెండో గేమ్‌లో నల్ల పావాలతో ఆడి హంపి చేసిన 54వ కదలికలోని తప్పిదంతో విజయం సాధించారు. ఈ గెలుపుతో దివ్య, హంపి, హారిక ద్రోణవల్లి, ఆర్. వైశాలి తర్వాత గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన నాల్గవ భారతీయ మహిళగా నిలిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 88వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందారు. ఫైనల్‌కు చేరిన కారణంగా దివ్య, హంపి ఇద్దరూ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించగా, దివ్య త్వరలో మహిళల ప్రపంచ ఛాంపియన్ జు వెంజున్‌తో తలపడనున్నారు.
Internal Links:
సిక్సుల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్..
External Links:
కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్!