5th Test Match Against England: భారత్-ఇంగ్లాండ్ మధ్య జులై 31న లండన్‌లోని ఓవల్ వేదికగా చివరిదైన ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనుంది. రిషబ్ పంత్ పాదం గాయం కారణంగా జట్టులో లేకపోగా, వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా కూడా అందుబాటులో ఉండటం లేదు. నాలుగో టెస్టులో విఫలమైన శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ లకు చోటు దక్కకపోవచ్చు. ఓపెనింగ్‌కు జైశ్వాల్, కేఎల్ రాహుల్ లు బరిలోకి దిగుతారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో ఆడగా, పంత్ గైర్హాజరుతో ధృవ్ జురెల్ ఐదో స్థానంలో కనిపించనున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో జడేజా, వాషింగ్టన్ సుందర్ లు బ్యాటింగ్ చేస్తారు. శార్దూల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఆకాష్ దీప్ తుది జట్టులోకి రానున్నాడు. నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న అతను ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించి అందుబాటులోకి వచ్చాడు. కాంబోజ్ అంచనాలను అందుకోలేకపోవడంతో అతని స్థానంలో అర్షదీప్ సింగ్‌ను తీసుకోవాలనే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో సిరాజ్ ప్రధాన పేసర్‌గా జట్టును నడిపించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ తమ తుది జట్టును జులై 30న ప్రకటించనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.
Internal Links:
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్..
External Links:
ఆ ఇద్దరిపై వేటు కన్ఫర్మ్.. చివరి టెస్టుకు నాలుగు మార్పులతో టీమిండియా