పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ జోడీ మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ కాంస్యం సాధించారు. దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని సాధించారు. మను బాకర్ 16 పాయింట్లు సాధించగా, దక్షిణ కొరియా 10 పాయింట్లు మాత్రమే సాధించింది.
మనుబాకర్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారతదేశం నుంచి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్ మనుబాకర్. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించింది. ఇప్పుడు మిక్స్డ్ ఈవెంట్‌లోనూ పతకం సాధించారు.