Amit Mishra Retirement: ఆర్. అశ్విన్ తర్వాత, టీం ఇండియాలోని మరో స్పిన్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. తన 25 ఏళ్ల క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. అమిత్ మిశ్రా టీం ఇండియాకు తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడి మొత్తం 156 వికెట్లు తీశాడు. IPLలో 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 3 హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ కూడా మిశ్రానే.
తన రిటైర్మెంట్‌ను గురువారం ప్రకటించిన మిశ్రా, ఈ నిర్ణయం సులభం కాదని చెప్పారు. వరుస గాయాల వల్ల ఆడటంలో ఇబ్బంది ఎదురైందని, అందుకే ఇప్పుడు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక కొత్త ఆటగాళ్లు ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. “జట్టును ఎల్లప్పుడూ ముందే ఉంచాను, ఇక కొత్త క్రికెటర్లకు అవకాశం రావాలి” అని అన్నారు. 2017లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత ఆయన దేశీయ క్రికెట్, IPLలో కొనసాగాడు. IPL 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్ ఆయన చివరిది. ఆ మ్యాచ్‌లో 20 పరుగులకే 1 వికెట్ తీశాడు.
Internal Links:
ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు..
External Links:
25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్