Asia Cup 2025 Hockey: భారత హాకీ జట్టు 2025 ఆసియా కప్‌ను అద్భుతంగా గెలుచుకుంది. సెప్టెంబర్ 7న జరిగిన టైటిల్ ఫైట్‌లో మన జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాపై 4–1 తేడాతో గెలిచి, ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీని మళ్లీ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగోసారి ఆసియా కప్‌ను అందుకున్న భారత్, 2003, 2007, 2017 తర్వాత ఇప్పుడు 2025లో కూడా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఐదు విజయాలు, ఒక డ్రాతో ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన చేసింది. విజయం సందర్భంగా హాకీ ఇండియా ప్రతి ఆటగాడికి రూ. 3 లక్షల ప్రైజ్ మనీ, సపోర్టింగ్ స్టాఫ్‌లో ప్రతి ఒక్కరికి రూ. 1.5 లక్షల బహుమతిని ప్రకటించింది. ఇది భారత హాకీకి చారిత్రాత్మక క్షణంగా నిలిచింది.
ఫైనల్లో భారత్ మొదటి నిమిషం నుంచే అటాకింగ్ గేమ్ ఆడి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి భాగంలోనే గోల్ చేసి ఆధిక్యం సాధించింది. రెండవ క్వార్టర్‌లో దిల్‌ప్రీత్ రెండో గోల్ చేయగా, మూడో క్వార్టర్‌లో మరోసారి అతడే గోల్ చేసి భారత్‌ను 3–0కు చేర్చాడు. నాల్గవ క్వార్టర్ ప్రారంభంలో అమిత్ రోహిదాస్ గోల్‌తో భారత్ 4–0 ఆధిక్యం సంపాదించింది. చివరి నిమిషాల్లో కొరియా ఒక గోల్ చేసినా ఫలితం మారలేదు. ఈ విధంగా భారత్ ఘన విజయం సాధించింది. మరోవైపు మూడో స్థాన పోరులో మలేషియా 4–3తో చైనాపై గెలిచింది. ఐదో స్థానం, మ్యాచ్‌లో జపాన్ 6–1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
Internal Links:
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సుమిత్, నీరజ్ బోణీ..
External Links:
8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం.. భారత జట్టుకు హాకీ ఇండియా ప్రైజ్ మనీ ప్రకటన